Site icon TeluguMirchi.com

కిరణ్ పద్దతి బాలేదు !

Palvai-Govardhan-Reddyడిఎల్ రవీంద్రా రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయడం మంచిపద్దతి కాదని ఎంపి పాల్వాయి గోవర్ధన రెడ్డి అభిప్రాయ పడ్డారు. డిఎల్ను తొలగించే అధికారం సిఎంకు ఉంటుందని, అయితే తొలగించిన విధానం బాగోలేదన్నారు. సిఎం ఆవేశంతో ఈ పని చేశారన్నారు. ఇక తెలంగాణా కాంగ్రెస్ ఎంపిలు టిఆర్ఎస్లో చేరాలనుకోవడం తొందరపాటు చర్య అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.

Exit mobile version