సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పి.సదాశివం

p-sadasivamభారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. సదాశివంను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ అల్తామస్ కబీర్ పదవీకాలం జూలై 18వ ముగియనున్నందున.. కొత్త నియామకం అవసరమైంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారిలో సదాశివం 40వ వారవుతారు.

64 ఏళ్ళ సదాశివం 1996 జనవరిలో మద్రాస్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆయన 2007 ఏప్రిల్‌లో పంజాబ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అదే ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 40వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సదాశివం 2014 ఏప్రిల్‌ 26 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. ఇక జస్టిస్‌ అల్తామస్‌ కబీర్‌ పదవీకాలం జులై 18తో ముగిస్తుంది.