“ఒసే ఒసే వదిలేసి వెళ్లిపోకే” తొలి కాపీ సిద్ధం

osei_vv4“ఒసే ఒసే వదిలేసి వెళ్లిపోకే”. ఈ గమ్మత్తయిన టైటిల్ తో యస్ టీమ్ పిక్షర్స్ వారు రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా ఓ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర తొలి కాపీ రెడీ అయింది. ఈ సందర్భంగా చిత్ర ప్రొడ్యూసర్ నల్లపు రవీంద్రబాబు చిత్ర విశేషాలను తెలియజేస్తూ… ‘తమిళ్ లో శంభో శివ శంభో వ్ అంటి చిత్రాన్ని అందించిన సంస్థ అంతా కొత్త వారితో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా ఇది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సెలక్ట్ చేసిన హీరో హీరోయిన్లతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. లవ్, డేటింగ్ కథాంశంగా యూత్ కి నచ్చే విధంగా నిర్మించబడి ఘన విజయం సాధించిన ఈ చిత్రంను త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ప్రస్తుతం ఈ చిత్రం తొలి కాపీ రెడీ అయింది. నవంబర్ మూడో వారంలో ఆడియో విడుదల ఉంటుంది. ఈ జనరేషన్ లవర్స్ మనోభావాలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయిన డేటింగ్ లో ఇద్దరి మధ్య ఉండే ప్రేమ, రొమాన్స్, ఇష్టాలు, చిలిపి చిలిపి గొడవలు వీటన్నింటిని కామిక్ స్క్రీన్ ప్లే లో చిత్రించారు డైరెక్టర్ షణ్ముఖరాజ్. చిత్రానికి మాటలు బాగా కుదిరాయి. యూత్ ని ఆకట్టుకునేలా ఉంటాయి. ప్రేమికుడు తన ప్రేయసితో ‘ఒసే ఒసే వదిలేసి వెళ్లిపోకే’ అని వెంటపడే ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…’ అని తెలిపారు. యమ్.ఎల్. లక్ష్మీ సమర్పించిన ఈ చిత్రానికి దర్శకత్వం : షణ్ముఖరాజ్; సినిమాటోగ్రఫీ : జోషి; సంగీతం: తాజ్ నూర్; మాటలు : సురేష్ జిత్తున్.