ఒంగోలు గిత్త కు క్లైమాక్స్ టచ్

ongole gitta in climaxఎనర్జిటిక్ హీరో రామ్, కృతి కర్బంధ జంటగా బి .వి .ఎన్ ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒంగోలు గిత్త’. ప్రస్తుతం దర్శకుడు భాస్కర్ ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ మూవీ విషయాలను తన ట్విట్టర్ లో తెలిపారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, ప్రస్తుతం క్లైమాక్స్ ను భారీగా తెరకెక్కిస్తున్నామని, చిత్రానికి ఇది హైలెట్ గా వుంటుందని తెలిపాడు. జి .వి ప్రకాష్ అందించిన సినిమా పాటలను ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి .