వ‌న్ బానే ఉంది గానీ….

mahesh-babu-oneమహేష్‌ బాబు టైటిల్ ఏమిటో తెలిసిపోయింది. టీజ‌రూ బ‌య‌టకు వ‌చ్చింది. అంతా బాగానే ఉంది. అయినా మ‌హేష్ ఫ్యాన్స్‌ లో ఏదో అసంతృప్తి. కేవ‌లం 30 సెకన్ల ఈ టీజ‌న్‌ ని మ‌హేష్ కటౌట్ పూర్తిగా చూళ్లేక‌పోయారు. అంతే కాదు.. ఆయ‌న సింగిల్ డైలాగూ చెప్పలేదు. దాంతో ప్రిన్స్ ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. పైగా వ‌న్‌… అనే టైటిల్ ప‌ల‌క‌డానికి సింపుల్‌ గా ఉంది. క్యాప్షన్ డ‌బ్బింగ్ సినిమా టైటిల్‌ లా ఉంది. ఇవి రెండూ అర‌గ‌డానికి కాస్తంత టైమ్ కావాల్సిందే. టీజ‌ర్ జాగ్రత్తగా చూస్తే.. మ‌హేష్ ఇందులో పాప్ సింగ‌రో, రాక్‌ స్టారో అనే అనుమానం వ‌స్తోంది. మ‌రి ఈ రెండింటిలో మ‌హేష్ పాత్ర ఏమిటి? ఎలా ఉంటుంది? అనే విష‌యాలు తెలియాలంటే కొంత కాలం ఆగాలి.