రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి తీపి కబురు చెప్పారు… కృష్ణంరాజు. ఒక్క అడుగు సినిమాకి త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్తారట. కృష్ణంరాజు దర్శకత్వం వహించే చిత్రమిది. ఇందులో ప్రభాస్ ఓ కీ రోల్ చేస్తున్నాడు. ఆ పాత్ర చెగోవేరాని పోలి ఉంటుందట. ఓ ప్రేమ జంటని కాపాడడానికి ఓ వీరుడు ఏం చేశాడనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా గురించి కృష్ణంరాజు చెబుతూ ”ఇదో యాక్షన్ ఎంటర్టైనర్. ప్రభాస్ పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. బాహుబలి తరవాత ఈ సినిమా మొదలెడతా…” అన్నారు. ఈ సినిమా స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి.