కేజీఎఫ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రస్తుతం కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో బిజీ గా ఉన్నాడు. రెండోవ చిత్రంతోనే తన సత్తా ఏంటో చూపించిన ప్రశాంత్ నీల్ కు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కేవలం కన్నడ నిర్మాతలే కాదు మన టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సైతం ఈయన తో సినిమాలు నిర్మించేందుకు పోటీ పడుతున్నారు. ఈ మధ్యనే టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రశాంత్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు..అందులో ఎన్టీఆర్ హీరో అన్నట్లే చెప్పకనే చెప్పింది. ఈ రెండు ట్వీట్స్ లో రేడియషన్ అనే పదం ఉపయోగించారు.
ఎన్టీఆర్ న్యూక్లియర్ ప్లాంట్, దానిని ఎదుర్కోవడానికి నేను రేడియేషన్ సూట్ లో వస్తాను.. అని ప్రశాంత్ నీల్ అంటే, నేడు మైత్రి మూవీ మేకర్స్ త్వరలో రేడియేషన్ సూట్ లో కలుద్దాం అని ట్వీట్ చేశారు. తాజాగా ఈరోజు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భాంగా మైత్రి మూవీ మేకర్స్ బర్త్ డే విషెష్ అందిస్తూ ఈ మాట చెప్పడం తో ఎన్టీఆర్ – ప్రశాంత్ మూవీ ఖరారైనట్లు ఫిక్స్ అవుతున్నారు.