నందమూరి తారకరామారావు 97వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు , చిత్ర సీమా ప్రముఖులు , తెలుగుదేశం పార్టీ నేతలు , కార్య కర్తలు జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు. ఆయన కుమారుడు బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఉదయమే ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మాత్రం ఇంటి వద్ద ఉండే తమ తాతకి శ్రద్ధాంజలి ఘటించారు.
అలాగే ఈ క్రమంలోనే టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ కూడా నివాళ్లు అర్పించింది. ఈ విషయాన్నిఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. “స్వర్గంలో ఉన్న మీరు నన్ను ఆశీర్వదించండి. దుష్ట శక్తులతో పోరాడే ధైర్యాన్నిచ్చేలా దీవించండి. మానవత్వం బొత్తిగా కరవైన ఈ రోజుల్లో మీవంటి నేతలు, మీవంటి నటుల అవసరం ఎంతో ఉంది” అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. పూనమ్ భావోద్వేగాలతో ట్వీట్ చేయడం తో ఆమె ట్వీట్ వైరల్ గా మారింది.