Site icon TeluguMirchi.com

నోకియా.. నుండి సరికొత్త మూడు బడ్జెట్ ఫోన్లు

ఇప్పటికే మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ ఫోన్లను అందించిన నోకియా ..తాజాగా మరో మూడు బడ్జెట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది. నోకియా సీ5 ఎండీ, నోకియా సీ2 టవా, నోకియా సీ2 టెన్నెన్. వీటిలో నోకియా సీ5 ఎండీ వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్, ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్ తో వచ్చింది. నోకియా సీ2 టవా, నోకియా సీ2 టెన్నెన్ స్మార్ట్ ఫోన్లు మాత్రం వెనకవైపు రెండు కెమెరాలతో లాంచ్ అయ్యాయి. ఈ మూడు ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ బటన్ ను అందించారు.

నోకియా సీ5 ఫీచర్లు & ధర చూస్తే..

* 6.5 అంగుళాల హెచ్ డీ+ వాటర్ డ్రాప్ డిస్ ప్లే
* యాస్పెక్ట్ రేషియో 19:9
* మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్
* ర్యామ్ 3 జీబీ వరకు ఉంది. దీని ఇంటర్నల్ స్టోరేజ్ 32 జీబీ.
* ఫోన్ లో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఒక డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి.

* దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్
* దీని ధర వచ్చేసి 169.99 డాలర్లుగా(సుమారు రూ.12,700).

నోకియా సీ2 టవా, సీ2 టెన్నెన్ ఫీచర్లు & ధర చూస్తే..

* నోకియా సీ2 టవా, సీ2 టెన్నెస్ స్పెసిఫికేషన్లు దాదాపు ఒకేలా ఉంటాయి.
* ఈ రెండు ఫోన్లలోనూ 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు
* మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్
* రెండిట్లోనూ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ నే అందించారు.
* దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఈ రెండిట్లో వెనకవైపు రెండు కెమెరాలనే అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరాగా ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
* వీటి బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్ గా ఉంది.

నోకియా సీ2 టెన్నెన్ స్మార్ట్ ఫోన్ ధర 69.99 డాలర్లుగా(సుమారు రూ.5,200) ఉండగా, నోకియా సీ2 టెన్నెన్ ధర 109.99 డాలర్లుగా(సుమారు రూ.8,300) ఉంది.

Exit mobile version