సబ్ ప్లాన్ బిల్లుకు కాలపరిమితి వద్దు : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళితులకు ప్రభుత్వం కేటాయించిన నిధులను వేరే పథకాలకు మళ్లించ వద్దని అన్నారు. నిజామాబాద్ జిల్లా పాదయాత్రలో ఇవాళ ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇతర పథకాలకు ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన నిధులను దారి మళ్లించవద్దని కోరారు. చంద్రబాబు సబ్‌ప్లాన్ బిల్లులో బిల్లు కాలపరిమితిపై స్పందించారు. దళితులకు న్యాయం జరిగే వరకు చట్టం అమలులో ఉండాల్సిందేనని,బిల్లుకు కాలపరిమితి విధించడం సరికాదని అన్నారు. వర్గీకరణకు అనుకూలంగా ఈ సబ్‌ప్లాన్ ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగ, ఉప కులాలకు 24,500 ఉద్యోగాలు తమ ప్రభుత్వ హయంలో వచ్చాయని తెలిపారు. ఉషామెహ్రా కమిషన్ వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని చేసిన సూచనను ఆయన గుర్తు చేశారు.