‘డమరుకం’ టికెట్లు లేవు!

నాన్నా పులి.. కధ గుర్తుంది కదా. ఇప్పుడు ‘డమరుకం’ కధ కూడా అలాగే తయారయ్యింది. ‘అదిగో వచ్చేస్తున్నాం, ఇదిగో వచ్చేస్తున్నాం’ అంటూ ఊరించి ఊరించి చివరికి వాయిదా వేయడం అలవాటైపోయింది. ఇప్పుడు 10న విడుదల అని చెబుతున్నా… ఎవరికీ నమ్మకాలు లేవు. అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వడానికి దియేటర్ యాజమాన్యం జంకుతుంది. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో ఆన్ లైన్ బుకింగ్ బంద్ చేసారు. “9వ తేదీన ఈ సినిమా వస్తుందని ప్రకటించారు. దాదాపు 3 వేల టికెట్స్ అడ్వాన్స్ గా ఇచ్చేసాం. చివరికి వాయిదా పడింది. టికెట్స్ డబ్బు తిరిగి ఇవ్వడానికి నానా పాట్లు పడ్డాం. మరో సారి ఈ పరిస్థితి పునరావృతం అయితే… మరింత దారుణంగా వుంటుంది. ప్రేక్షకులు రెచ్చిపోయి… దియేటర్ అద్దాలు పగలగొట్టే ప్రమాదం వుంది” అని యాజమాన్యం వివరణ ఇస్తోంది. పైగా… శనివారం రిలేజ్ పెట్టుకని ఇప్పటి వరకూ ప్రింట్లు థియేటర్ దగ్గరకు చేరలేదట. ఈ సినిమా మళ్ళీ వాయిదా పడితే.. ప్రేక్షకులకి సమాధానం చెప్పుకోవడం ఇష్టంలేక ముందు జాగ్రత్త చర్యగా.. ఆన్ లైన్ టికెట్స్ నిలిపారు. ఈ పరిణామాలు చూస్తుంటే… ‘డమరుకం’ మళ్ళీ వాయిదా పడుతుందా? అనే అనుమానాలు పుడుతున్నాయి. రేపు బొమ్మ పడే వరకూ ఏమి చప్పలేము. ఏమైనా జరగోచ్చు.