ములాయం పై విచారణ కొసాగుతుంది : సుప్రీం కోర్టు

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఆస్తుల కేసులో ములాయం సింగ్ యాదవ్ పై విచారణ కోనసాగుతుందని సుప్రీం కోర్టు ఈ రోజు తేల్చి చెప్పింది. ఆస్తుల కేసులో సీబీఐ విచారణను సవాలు చేస్తూ ములాయం దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు కొనసాగించాలని సీబీఐ ను సుప్రీం కోర్టు ఆదేశించింది.
అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ములాయం కోడలు డింపుల్ కు అత్యున్నత న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ఈ కేసు విచారణ నివేదికను ప్రభుత్వానికి కాకుండా నేరుగా తమకే సమర్పించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. 2007లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ములాయం, అఖిలేష్ పై విచారణకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ములాయం ఈ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17, 2011న వాయిదా వేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ రోజు తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు.