Site icon TeluguMirchi.com

‘ఛలో అసెంబ్లీ’ని అనుమతించం: సిపి

cp-anurag-sharmaశాసనసభాపతి నాదెండ్ల మనోహర్తో పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో..  శాసన సభాపతి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం నగర్ పోలీస్ కమిషనర్ (సిపి) అనురాగ్ శర్మ మాట్లాడుతూ…  ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి తమను ఎవరూ అనుమతిని కోరలేదని అన్నారు. అయితే, ఇటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వబోమని ఆయన అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని శర్మ హెచ్చరించారు. తెలంగాణ రాజకీయ ఐకాస ‘ఛలో అసెంబ్లీ’కి  పిలుపునిచ్చిన నేపథ్యంలో..  భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు సిపి వివరించారు. 

Exit mobile version