Site icon TeluguMirchi.com

జగన్‌ తో లింక్ లేదు: కిరణ్

kiranజగన్‌తో తనకు సంబంధాలను అంటగడుతూ తెలుగుదేశం సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు చేసిన ఆరోపణలపై కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం శానససభలో ప్రతిస్పందించారు. తమ పార్టీలో లేనివారితో తాము సంబంధాలు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేసారు. తెలుగుదేశం పార్టీని ఎలా ప్రత్యర్థిగా చూస్తామో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కూడా అలాగే చూస్తామని ఆయన అన్నారు. వైయస్ జగన్ కేసులో తమ మంత్రులపై వచ్చిన ఆరోపణలపై తాను చెప్పిన మాటలను సాక్షి డైలీ వక్రీరించిదని, తాము ఒక పార్టీలోనే కొనసాగుతామని, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని కిరణ్ పేర్కొన్నారు.

Exit mobile version