బలుపుతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు రవితేజ. ఈ సినిమా అటూ, ఇటూ అయితే రవితేజ కెరీర్‌కి పుల్‌స్టాప్ పడిపోయినట్టే. అందుకే ఈ సినిమా కోసం చాలా శ్రద్ధ తీసుకొన్నాడు. బ్రహ్మానందం కామెడీ, శ్రుతిహాసన్ అందాలు తన సినిమాని కాపాడతాయని గట్టిగా నమ్ముతున్నాడు. ముఖ్యంగా శ్రుతి ఇందులో అదరగొట్టేసిందట. తన గ్లామర్‌తో వల వేసిందట. ఓపాటలో అయితే చాలా హాట్‌గా కనిపిస్తుందట. రవితేజ-శ్రుతిహాసన్‌ల మధ్య ఓ లిప్‌లాక్ సీన్ కూడా ఉందని.. ప్రచారం జరిగింది. అయితే అలాంటి వేడి ముద్దులు మాత్రం లేవట. రొమాంటిక్ సన్నివేశాలైతే ఉంటాయి. అంతేతప్ప ముద్దులుండవు.. అని చిత్రబృందం ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ శుక్రవారం బలుపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.