Site icon TeluguMirchi.com

” జగన్ కు అదనంగా ఎమీ లేదు ! “

image_Jagan (1)జైళ్ళ శాఖ నిబంధనల మేరకు ఒక ప్రత్యెక ఖైడికి ఎలాంటి సదుపాయాలు కల్పించాలో అంతవరకు   మాత్రమే వై ఎస్ ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కి ఆ మేరకే సదుపాయాలు కల్పిస్తున్నామని,  అదనంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించటం లేదని జైళ్ళ శాఖ డి. జి. కృష్ణంరాజు స్పష్టం చేసారు.   చంచల్ గూడా జైలులో జగన్ నీలి చిత్రాలు చూస్తున్నారని, అక్రమంగా ములాఖత్ లు ఏర్పాటవుతున్నాయని  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు ఈ  ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు.దేశంలోనే మన రాష్ట్ర జైళ్ళ నిర్వహణకు మంచి పేరు   వుందని, నిరాధారమైన ఆరోపణలు చేయటం సబబు కాదని ఆయన పేర్కొన్నారు.

 

Exit mobile version