నితిన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. రెండు హిట్లతో జోరు, గేరు రెండూ పెంచాడు. కరుణాకరన్‌తో ఓ సినిమా ఒప్పుకొన్నాడని టాలీవుడ్ సమాచారమ్. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది కాకుండా… నితిన్ మరో సినిమాకి పచ్చజెండా ఊపాడు. అలా మొదలైంది, జబర్ దస్త్ దర్శకురాలు – నందినిరెడ్డి తో జట్టు కట్టబోతున్నాడు. ఇప్పటికే ఇద్దరి మధ్యా కథాచర్చలు జరిగాయట. నందిని కథ… నితిన్‌కి నచ్చడంతో ఒకే చెప్పేశాడు. పీవీపీ సినిమా ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ప్రస్తుతం నితిన్ కొరియర్ బోయ్ కల్యాణ్ సినిమాలో నటిస్తున్నాడు. దాని తరవాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.