ఎన్టీఆర్ , చరణ్ ఫ్యాన్స్ బాధ అంత ఇంత కాదు..

మెగా అభిమానులతో పాటు నందమూరి అభిమానులు పూర్తి నిరాశలో పడ్డారు. తమ అభిమాన హీరోలు ఇద్దరు ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు..అది కూడా రాజమౌళి లాంటి దర్శక ధీరుడి డైరెక్షన్లో నటిస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి అభిమానుల సంతోషం అంత ఇంత కాదు. వారి సంతోషానికి తగ్గట్లే రాజమౌళి సినిమాను ప్రకటించడం జరిగింది.

కానీ ఆ ప్రకటన మాత్రం ఆనందంలో నింపింది. ఆ తర్వాత అన్ని నిరాశనే నింపాయి. ఇప్పటికే వరకు ఫస్ట్ లుక్ తప్ప మరో అప్డేట్ రాకపోయేసరికి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మిగత హీరోల సినిమాల తాలూకా అప్ డేట్స్ , ఫస్ట్ లుక్ లు , టీజర్ లు ఇలా ప్రకటించడం , రిలీజ్ అవ్వడం జరుగుతుంటే.ఆర్ఆర్ఆర్ మాత్రం ఎక్కడ మొదలయ్యిందో..అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ సైతం ఆగిపోవడం తో అభిమానులు ఇంకాస్త నిరాశకు గురైయ్యారు. మరి వీరికి సంతోషం కలిగించే వార్త రాజమౌళి ఎప్పుడు చెపుతాడో చూడాలి.