అఫీషియల్‌.. విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య !


చాలా రోజులుగా మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త జొన్నలగడ్డ చైతన్య తో విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే నిజమైంది. అవును వాళ్లిదరు విడాకులు తీసుకున్నారు. నిహారిక-చైతన్య దంపతులు విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు కూడా వీరికి విడాకులు మంజూరు చేసింది. దీంతో వీరిరువురు అధికారకంగా విడిపోయారు. ప్రస్తుతం దీనికి సంభందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే నిహారిక, జొన్నలగడ్డ చైతన్య ల వివాహం 2020 డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గల ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గత కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల చైతన్య తన ఇన్‌స్టా పేజి నుండి నిహారికకు సంబంధించిన ఫొటోలను తొలగించారు. ఆ తర్వాత కొన్నిరోజులకు నిహారిక కూడా చైతన్య ఫొటోలను తొలగించింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో జరిగిన ఈవెంట్లలో నిహారిక ఒక్కరే పాల్గొన్నారు. దీంతో వీరు విడిపోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఇద్దరిమధ్య అభిప్రాయభేదాలు రావడంతో కొన్నిరోజులుగా వేర్వేరుగా ఉంటున్న వీరు ఇప్పుడు అఫీషియల్‌ గా విడిపోయారు.