మిల్కీ బ్యూటీ చేసిన కామెంట్ ఇప్పుడు ఆమెను వివాదంలో పడేలా చేసింది. ఈ మధ్యనే అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. అలాగే కేరళలో ఏనుగు హత్యపై తీవ్రస్థాయిలో స్పందిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో తమన్నా సోషల్ మీడియాలో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. నల్లజాతీయులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. ఇలాంటి సంఘటనలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని తన స్టేట్‌మెంట్‌లో కోరింది. ‘మీ మౌనం నిన్ను కాపాడదు. మనిషైనా..జంతువైనా..ప్రతి ప్రాణం ముఖ్యమే కదా? మనం మనిషిగా జీవించడం మళ్లీ నేర్చుకోవాలి’ అంటూ తన సందేశం ఇచ్చింది.
ఈ సందేశం ఫై నెటిజన్స్ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఇప్పుడు నల్ల జాతీయులకు సంఘీభావం తెలిపేలా వ్యాఖ్యలు చేస్తున్న తమన్నా…గతంలో ఫెయిర్ అండ్ లౌలీ యాడ్స్‌లో నటించడమే విమర్శలకు కారణం. గతంలో తెలుపు రంగును ప్రమోట్ చేసేందుకు ఫెయిర్ అండ్ లౌలీ యాడ్స్‌లో నటించిన తమన్నా..ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.