Site icon TeluguMirchi.com

బికినీలో నయనానందం

ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టాక నయనతార మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయింది. తన తాజా చిత్రం “కృష్ణం వందే జగద్గురుం” నవంబర్‌ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. మరోచిత్రం నాగార్జునతో జంటగా నటిస్తున్న “లవ్‌ స్టోరీ” దాదాపుగా పూర్తి కావచ్చింది. డిసెంబర్‌ నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. కాగా, లవ్‌ స్టోరీ కోసం నయన్‌ కు భారీగానే పారితోషికం లభించినట్లు తెలిసింది. ఎందుకలా అని ఆరాతీస్తే ఆ చిత్రంలో నయనానందకరంగా నయంతార బికినీలో కనిపించే సన్నివేశాలున్నట్టు తెలిసింది. ఈ చిత్రకథను చెప్పినప్పుడే దర్శకుడు దశరథ్ ఈ బికినీ మ్యాటర్‌ చెప్పి మరీ భారీ పారితోషికం ఆఫర్‌ చేశాడట. అప్పుడెప్పుడో అయిదేళ్ళ కిందట తమిళంలో అజిత్‌ సరసన చేసిన “బిల్లా”లో బికినీ వేసి అందాలను ఆరబోసిన నయన మళ్ళి ఇప్పుడు “లవ్‌ స్టోరీ” చిత్రంలో మరోసారి తన అందాలను ఆరబోయడానికి రెడీ అయిపోయింది…
Exit mobile version