నయనతార నాన్-వెజ్ మానేసింది ఎందుకో తెలుసా..?

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నాన్ వెజ్ తినడం మానేసింది..ప్రియుడి కోసం మానేసిందని అనుకోకండి..ఓ సినిమా కోసం తినడం మానేసింది. దర్శకుడు ఆర్ జె బాలాజీ మూకుతి అమ్మన్ అనే టైటిల్ తో డివోషనల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార అమ్మవారిగా మరియు భక్తురాలిగా కనిపించబోతుంది. తాజాగా నయన్ అమ్మవారి గెటప్ లో పిక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు చిత్ర యూనిట్.

భక్తి రస చిత్రం కావడంతో ఈ మూవీ చిత్రీకరణ సమయంలో చాలా నిష్టగా ఉంటుందట. ఈ షూటింగ్ జరిగినంత కాలం నయన తో పాటు చిత్ర యూనిట్ లో ఎవరు కూడా నాన్ వేజ్ ముట్టుకోలేదని చెపుతున్నారు. గత నెలలోనే ఈ చిత్రం విడుదల కావాల్సివుండగా లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. థియేటర్స్ ప్రారంభం అయిన వెంటనే మూకుతి అమ్మన్ మూవీ విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.