Site icon TeluguMirchi.com

మరోసారి నాయక్‌ సినిమా సెన్సార్ ???

Nayak Movie Latest Postersరాం చరణ్‌ కి కూడా సెన్సార్ కష్టాలు తప్పేలా లేవనిపిస్తోంది. అయితే ఇదేదో సన్నివేశాల కత్తిరింపో మరేదో కాదట. సెన్సార్ వారు నిన్ననే ఈ చిత్రాన్ని చూడడం… అన్నీ ఓకే అనీ, అయినా ఈ చిత్రంలో ఉన్న కొన్ని డైలాగ్స్‌, యాక్షన్‌ సన్నివేశాల్లో మోతాదు పెరిగిన హింస ఉండడంతో “ఏ” సర్టిఫికెట్‌ ఇచ్చారట. అయితే ఇది చరణ్‌ తో పాటు సినిమా యూనిట్‌ కి కాస్త ఇబ్బందిగా అనిపించినట్టు సమాచారం. సినిమా వరకూ అయితే ఫరవాలేదు కానీ బుల్లితెరకు వచ్చే సరికి ఈ సర్టిఫికెట్‌ కాస్త ఇబ్బందవుతేమో అని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఈ చిన్న ఇబ్బందులను సైతం తీర్చేలా తమంతట తామే సినిమాలో ఏ సర్టిఫికెట్‌ కు దారితీసిన దృశ్యాలు, డైలాగ్స్‌ ను మార్చేద్దామని డిసైడ్‌ అయినట్టు సమాచారం. కావలసిన మార్పులు, చేర్పులు చేసుకుని మరోసారి సెన్సార్ చేయించేసి క్లీన్‌ “యు” సర్టిఫికెట్‌ సంపాదించాలని నిర్ణయించుకున్నారట. ఇది అందరికీ మంచి పరిణామమే కాబట్టి నిజమయితే నాయక్‌ యూనిట్‌ ని అభినందించాల్సిందే!!!

Exit mobile version