Site icon TeluguMirchi.com

నాయక్ డబ్బింగ్ షురూ

మెగా పవర్ స్టార్ చరణ్, మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం నాయక్. యూనివర్సల్ మీడియాపై డి .వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కాజల్, అమలా పాల్ ఆడి పాడనున్నారు. నాయక్ సంభందించిన షూటింగ్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలుకూడా వేగంగా జరుగుతున్నాయి. సినిమాకి సంభందించిన డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టూడియోలో ప్రారంభమయ్యాయి. డిసెంబర్10వ తారీఖున ఆడియో ను, జనవరి 9 లేదా 11న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version