నెక్లెస్‌ రోడ్‌ లో విడుదలవనున్న రామ్‌ చరణ్‌ “నాయక్‌” ఆడియో

ఎంతోకాలం నుండి మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రామ్‌ చరణ్‌ “నాయక్‌” ముహూర్తం దగ్గరపడుతోంది. రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా కాజల్‌, అమలాపాల్‌ కథానాయికలుగా తెరకెక్కుతున్న సినిమా ‘నాయక్‌’. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో యూనివర్శల్‌ మీడియా పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ సమర్పణలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. నాయక్‌ సినిమా 2013 జనవరి 9న విడుదలకు సిద్ధమైంది. ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీతం అందిస్తున్న నాయక్‌ సినిమా ఆడియోను డిసెంబర్‌ నెల 15న అత్యంత వైభవంగా రిలీజ్‌ చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చెర్రీ అభిమానులు భారీ మొత్తంలో ఈ ఆడియో రిలీజ్‌ వేడుకకు వస్తారనే ముందస్తు అంచనా లు నెలకొన్నాయి. దీనితో ఆడియో విడుదల వేదికను తొలుత అనుకున్న చోట నుంచి ఇప్పుడు హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌కి మార్చారని తెలుస్తోంది.