నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో నర్తనశాల అనే చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా ఎన్బికె థియేటర్లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేసారు.
ఈ లెక్కలోనే నర్తనశాల దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిందని తెలుస్తుంది. సినిమా విడుదలయ్యే వరకు.. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని కలిపి ఒక లక్షా 58 వేల దాకా టికెట్ అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో 37 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. అంటే మొత్తం తొలిరోజు నర్తనశాల సినిమాకు 1 లక్షా 95 వేల దాకా వ్యూస్ దక్కినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి ఒక్క టికెట్ 50 రూపాయలు నిర్ణయించారు.
ఈ లెక్కన 1 లక్షా 95 వేల టికెట్లకు 50 రూపాయల చొప్పున లెక్కిస్తే మొత్తం మీద సినిమాకి తొలిరోజు 97 లక్షల 50 వేల దాకా కలెక్షన్స్ వచ్చాయన్నమాట. థియేటర్లు లేకుండా యాప్లో మాత్రమే ఈ రకంగా వసూళ్లు వచ్చాయి. కేవలం 17 నిమిషాల వీడియోకు ఈ స్థాయిలో వ్యూస్ రావడం విశేషం.