అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం కెవ్వుకేక. షర్మిలా మాండ్రే కథానాయిక. దేవి ప్రసాద్ దర్శకత్వం వహించారు. జూన్ 30 నరేష్ పుట్టనరోజు. ఈ సందర్భంగా కెవ్వు కేక పాటల్ని విడుదల చేయనున్నారు. చిన్నిచరణ్-బీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ”100 % వినోదాత్మకంగా నడిచే సినిమా ఇది. నరేష్ నటన. మేనరిజం అన్నీ ఆకట్టుకొంటాయి. టైటిల్‌కి తగినట్టే కామెడీ కేక పుట్టిస్తుంది. జులై ప్రథమార్థంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం..” అని చిత్రబృందం చెబుతోంది.