Site icon TeluguMirchi.com

రానా పెళ్లిని నాని ఏలా చూస్తున్నాడో తెలుసా..?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఈరోజుతో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను ప్రేమించిన మిహికా తో ఏడుఅడుగులు వేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో వీరి పెళ్లికి 30 మంది అతిథుల్నిమాత్రమే ఆహ్వానించారు. ఇక మీడియాకి కూడా పర్మిషన్ లేకపోవడంతో రానా పెళ్లికి సంబంధించిన ఫొటోలు కాని.. వీడియోలు కాని బయటకు రావడం లేదు.

ఈ పెళ్లి వేడుకను ఇంటి దగ్గర నుంచే చూడటానికి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు సినీ స్టార్స్. అయితే రానా పెళ్లి వేడుకను స్కోప్‌లో చూస్తూ.. ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు నాని. తనదైన శైలిలో వెరైటీగా రానాకి విషెష్ అందించిన నాని.. ఈ టెక్నాలజీ ఏంటో అంటూ కామెంట్ చేశాడు. వాచింగ్ ది ఎండ్ ఆఫ్ ఏన్ ఐకానిక్ బ్యాచ్‌లర్అంటూ ఈ ఫొటోకి ఫన్నీ కామెంట్ చేసిన నాని.. కంగ్రాట్స్ బాబాయ్ అంటూ రానాకి పెళ్లి విషెష్ అందించారు.

Watching the end of an iconic bachelor ?@RanaDaggubati

Congratulations babai ?

Ee technology ento .. pic.twitter.com/4WYE4xvj7r— Nani (@NameisNani) August 8, 2020

Exit mobile version