చైతూ… శివ జోలికి వెళ్లకు!

chituచాలా కాలం త‌రవాత నాగ‌చైత‌న్యకు త‌డాఖాతో హిట్ దొరికింది. ఆ ఆనందం ఇప్పుడు నాగార్జున క‌ళ్లలో క‌నిపిస్తోంది. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారాయ‌న‌. అందుకే త‌న ఆనందాన్ని ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ ప్రక‌టించుకొన్నారు. ”అన్నద‌మ్ముల అనుబంధం అనేది తిరుగులేని స‌బ్జెక్ట్‌. అదొక్కటే కాదు.. ఈ సినిమాలో అన్నీ క‌లిసొచ్చాయి. సునీల్ బాగా చేశాడు. చైతూ – త‌మ‌న్నాల మ‌ధ్య న‌డిచిన రొమాంటిక్ స‌న్నివేశాలు బాగా వ‌చ్చాయి. డాలీ ద‌ర్శక‌త్వ ప్రతిభ న‌చ్చింది..” అని టీమ్‌ని తెగ పొగిడేస్తున్నాడు. అంతే కాదు… చైతూకి ఓ స‌ల‌హా కూడా ఇచ్చాడు. ప‌దే ప‌దే రీమేక్‌ల జోలికి వెళ్లొద్దని. ”రీమేక్‌లంటే నాకు ఇష్టం ఉండ‌దు. ఆ ఫీల్ పాడైపోతుంద‌నే భ‌యం ఎక్కువ‌. దేవ‌దాస్ రీమేక్ చేయ‌మంటే అది నావ‌ల్ల కాదు. శివ‌లాంటి సినిమా… చైతూ చేయ‌కూడ‌దు. హ‌లో బ్రద‌ర్ లాంటి సినిమాలు చేయొచ్చు. అది ట్రెండీగా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు. మ‌నం సినిమా వేస‌వి తాపం త‌గ్గాక మొద‌ల‌వుతుందట‌. అందులో ముగ్గురి పాత్రలూ స‌మ ఉజ్జీలుగానే ఉంటాయ‌ని చెబుతున్నారు.