Site icon TeluguMirchi.com

తండ్రికి వేడి… తనయుడికి సెగ

పాపం నాగార్జున…. తన కెరియర్‌ లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా “డమరుకం” ప్రాజెక్ట్‌ ఖరారైనప్పుడు ఎంత సంతోషపడ్డాడో తెలీదు కానీ, ఇప్పుడు పూర్తయిపోయిన ఆ సినిమా రిలీజ్‌ కు నోచుకోలేక వాయిదాల పర్వంలో కొట్టుమిట్టాడుతుండడంతో బాగా ఖంగారు పడుతున్నట్టు సమాచారం. ఆ సినిమా రిలీజ్‌ కాకపోవడం వల్ల కలిగే నష్టం కన్నా, తన తరువాత చిత్రాలపై “డమరుకం” చూపే నెగెటివ్ ఎఫెక్ట్‌ దీనికి ముఖ్యమైన కారణం. అందునా అగ్రహీరోల్లో ఒకడిగా వెలిగిపోతున్న తన సినిమా ఇలా ఆగిపోవడమంటే ఎవరైనా సరే బాధపడతారు, తప్పదు మరి. ఇవన్నీ కాదని లేటెస్ట్‌ గా మరో దెబ్బ పడ్డట్టు తెలుస్తోంది. డమరుకం తో పాటుగా ఆర్‌ ఆర్‌ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న మరో సినిమా “ఆటో నగర్‌ సూర్య”. దేవకట్టా దర్శకత్వంలో నాగార్జున తనయుడు నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఇప్పుడు సదరు సినిమా నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల వల్ల చైతూ సినిమా కూడా ఆగిపోయినట్టే అని వార్తలొచ్చాయి. దీంటో నాగార్జునకు తగిలిన ఆర్‌ ఆర్‌ వారి వేడి తాలూకు సెగ తన కుమారుడికి కూడా తగిలినట్టయిందని ఫిలింనగర్‌ వర్గాల భోగట్టా!
Exit mobile version