అబ్బాయికీ లైన్ క్లియర్…

హమ్మయ్య….  నాగార్జున చెప్పినట్టే శివుడు కరుణించాడు.  కొంతమంది  నిర్మాతలు తలో చేయీ వేసి… మునిగిపోతున్న ‘డమరుకం’ సినిమాని ఒడ్డున పడేసారు. ఇందులో హీరో నాగార్జున వాటా కుడా ఉందనుకోండి  మొత్తానికి ‘డమరుకం’ మోగడానికి సిద్ధంగా వుంది. మరోవైపు అబ్బాయి సినిమా ‘ఆటో నగర్ సూర్య’కీ లైన్ క్లియర్ అయినట్టే! ‘డమరుకం’ గొడవ తేలేవరకు ‘ఆటో నగర్ సూర్య’ సినిమా షూటింగ్ ఊసే లేదు. ఇప్పటకే 80 % పూర్తయినా దాని గురించి పట్టించుకోలేదు. ‘డమరుకం’ కి అన్ని అడ్డంకులూ తొలగిపోవడంతో ఆర్.ఆర్. మూవీ మేకర్స్… నాగ చైతన్య సినిమాపై దృష్టి పెట్టింది. ఈ సినిమా విషయంలోనూ బడ్జెట్ తడిసి మోపెడయ్యింది. సినిమా పూర్తి చేయలేక, మద్యలో ఆపుకోలేక సతమత మవుతున్న పరిస్థితుల్లో నాగ్.. తన తనయుడి కోసం ఆపన్న హస్తం అందించాడు. ఆ సినిమా ఫైనాన్స్ బాద్యతనూ స్వీకరించాడు. దాంతో…. ఆటో నగర్ సూర్యకి మోక్షం లభించింది. శుక్రవారం చైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘ఆటో నగర్….’ ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.