ఆయన నిక్కర్ వేసుకున్నప్పుడే.. ఈయన జైలుకెళ్లాడట !

kcr-nagam1969 తెలంగాణ ఉద్యమం సమయంలో తెరాస అధినేత కేసీఆర్ అడ్రస్ ఎక్కడుందని బీజేపీ నేత నాగం జనార్దన్ సూటిగా రెడ్డి ప్రశ్నించారు. వరంగల్ స్టేషన్ గణపూర్ సభలో కేసీఆర్.. తనపై చేసిన విమర్శలకు నాగం తగిన విధంగా
స్పందించారు. కేసీఆర్ నిక్కర్ వేసుకున్నప్పుడే ఉద్యమంలో పాల్గొని తాను జైలుకెళ్లానని నాగం అన్నారు. తెలంగాణ ఉద్యమం 2001లోనే ప్రారంభమైందని కేసీఆర్ భావిస్తున్నారని… తెలంగాణ ఉద్యమం చరిత్ర తెలుసుకోవాలంటూ
కేసీఆర్ కు ఆయన చురకలంటించారు. తెరాస ఆవిర్భావం ముందే బీజేపీ రెండు రాష్ట్రాలు కావాలన్న విషయాన్ని నాగం ఈ సందర్భంగా గుర్తు చేశారు.