బాలయ్య కు నాగబాబు కౌంటర్

రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఆకూ అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు బాలకృష్ణ.

బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయ్యారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని నాగబాబు వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడారు. బాలయ్య వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని, బాలయ్య మాట్లాడింది చాల తప్పు అని నాగబాబు పేర్కొన్నారు. బాలయ్య మాటలు పరిశ్రమనే కాకుండా, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని నాగబాబు అన్నారు. ప్రభుత్వం, పరిశ్రమకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో ఒకేసారి ఏపీకి వెళ్తే తెలుస్తుందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏపీని ఎవరు సర్వనాశనం చేశారని ప్రశ్నించారు. బాలకృష్ణ ఏం మాట్లాడినా నోరుమూసుకుని కూర్చోబోమని, ఇండస్ట్రీకి బాలకృష్ణ కింగ్ కాడనై, కేవలం హీరోనే అని నాగబాబు పేర్కొన్నారు. బాలయ్యపై నాగబాబు హాట్ కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీ వేడెక్కింది.