పిచ్చి కుక్కల కాలం అంటూ నాగబాబు మరో ట్వీట్

రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఆకూ అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు బాలకృష్ణ.

బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయ్యారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని నాగబాబు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. దీని ఫై సోషల్ మీడియా లో మెగా , నందమూరి ఫ్యాన్స్ వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి నాగబాబు మరో ట్వీట్ చేసి ఇంకాస్త మంట పెట్టాడు.

పళ్లు బయటకు పెట్టి అరుస్తూ భయంకరంగా ఉన్న పిచ్చి కుక్క ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఇది పిచ్చి కుక్కల కాలం అంటూ మంట పెట్టే పోస్ట్ పెట్టారు. ‘పిచ్చి కుక్కలు చాలా డేంజర్.. జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్యశాఖ చెబుతోంది. అలాంటి కుక్కల్ని నిర్బంధంలోనైనా ఉంచాలి.. చంపేయాలి.. కానీ అలా వదిలేయకూడదు.. అవి జీవితాన్ని బలి తీసుకుంటాయి.. అసలే ఇది పిచ్చి కుక్కల సీజన్’ అంటూ ట్వీట్ చేశారు.