బాలకృష్ణ తో పోల్చుకునేంత కెపాసిటీ నాకు లేదు – నాగబాబు

గత వారం రోజులుగా చిత్రసీమ లో నాగబాబు vs బాలకృష్ణ కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి ని కలవడానికి వెళ్ళినప్పుడు నన్ను పిలవలేదని చెప్పి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. దానికి నాగబాబు కౌంటర్ ఇవ్వడం చేయడం తో మెగా , నందమూరి అభిమానుల మధ్య వార్ మొదలు అయ్యింది. రోజు రోజు కు ఈ వార్ ఎక్కువ అవుతుండడం తో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని సినీ పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇరువురితో మాట్లాడినట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ తో పోల్చుకునేంత కెపాసిటీ నాకు లేదు నాగబాబు అన్నారు. బాలకృష్ణ గారిని టార్గెట్ చేయాలని కాదు.. మొదటగా బాలకృష్ణ గారు ఆవేశపడ్డారు. అది కరెక్ట్ కాదని నా వేలో చెప్పాను తప్ప.. నాకు బాలకృష్ణ గారితో శతృత్వం లేదు.

నిజానికి నేను బాలకృష్ణ గారితో ఏ విషయంలోనూ సమానం కాదు. నేను చిరంజీవి బ్రదర్‌నే తప్ప బాలకృష్ణ మాదిరి హీరోని కాదు. నేనో నిర్మాతని. బాలకృష్ణ హీరో. ఆయనతో సమానం అని చెప్పుకునే కెపాసిటీ నాకు లేదు. ఆయనతో సమానంగా ఉండే వ్యక్తిని కాదు నేను. బాలకృష్ణ గారితో నాకు ఎటువంటి శతృత్వం లేదు.. బాలకృష్ణ గారితో నాకు విభేదాలు లేవు. హలో అంటే హలో తప్ప.. ఆయనతో నాకు పెద్దగా పరిచయం కూడా లేదన్నారు.