కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు !

rajayyaగతకొద్దికాలంగా తెరాసలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న ముగ్గురు టీ-కాంగ్రెస్ ఎంపీల్లో.. ఓ ఎంపీ ఫ్లేటు ఫిరాయించాడు. తాను కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్పష్టం చేశారు. తెలంగాణను
ఇచ్చే శక్తి ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉందని, కాంగ్రెస్ లోనే ఉండి తెలంగాణ కోసం పోరాటం చేస్తానని ఆయన అన్నారు. తెలంగాణపై అధిష్టానం అనుకూలంగానే ఉందని వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదని రాజయ్య గుర్తు చేసారు. అవును మరీ.. అక్కడ సీటు ఖరారు కాకుంటే.. ఇక్కడ ఇవే మాట్లాడాలని రాజకీయనాయకులు గుసగుసలాడుతున్నారు.