Site icon TeluguMirchi.com

నిర్మాతలకు షాక్ ఇవ్వబోతున్న డిస్ట్రిబ్యూటర్లు

లాక్ డౌన్ కారణంగా చిత్రసీమ కుదేల్ అవుతుంది. ముఖ్యంగా భారీ పెట్టుబడి పెట్టి సినిమాలు చేస్తున్న నిర్మాతల కష్టాలు మాములుగా లేవు. షూటింగ్ లు ఆగిపోవడం , రిలీజ్ కావాల్సిన సినిమాలు ల్యాబ్ కే పరిమితం కావడం, బయట తెచ్చిన డబ్బుకు వడ్డీలు పెరిగిపోతుండటం తో వారికీ చావే గతి అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. వీరి బాధలు ఇలా ఉంటె..డిస్ట్రిబ్యూటర్ల కష్టాలు మరోలా ఉన్నాయి. భారీ పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకున్న జనాలు థియేటర్స్ కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అందుకే వీరు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు.

ఎంత గొప్ప క్రేజీ హీరో నటించిన సినిమా అయినా కొనకూడదన్న నిర్ణయానికి కొందరు వచ్చారట. ఎందుకంటే థియేట్రికల్ రిలీజ్ చేసినా జనం థియేటర్లకు వస్తారా రారా? అన్న సందిగ్ధత డిస్ట్రిబ్యూటర్ ని నిలువనీయడం లేదుట. ఆ క్రమంలోనే ఓ అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు ఇకపై నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ (ఎన్.ఆర్.ఏ- తిరిగి ఇవ్వనిది) కేటగిరీలో భారీ సినిమాలకు ఒప్పందాలు చేసుకునే ఆలోచనను విరమించారట. ఆయన బాటలోనే పలువురు ఇప్పటికే ఆ దిశగా ఆలోచిస్తున్నారన్న సమాచారం ఉంది. ఏదైనా తమ పంపిణీ సంస్థలో రిలీజ్ చేసుకునే వెసులుబాటు కల్పించి లాభాల్లో వాటాలు పంచుకునే ప్రాతిపదికను తెరపైకి తేనున్నారట.

Exit mobile version