Site icon TeluguMirchi.com

మోపిదేవికి అస్వస్థత..!

Mopidevజగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్ గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ తీవ్రమైన ఛాతినొప్పితో బాధపడుతున్నారు. దీంతో.. ఆయనను చికిత్స నిమిత్తం జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో వైద్యులు మోపిదేవికి చికిత్స చేస్తున్నారు. అయితే, గుండె సంబంధ వ్యాధితో మోపిదేవి బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జగన్  అక్రమాస్తుల కేసులో మోపిదేవి గత సంవత్సరం అరెస్టయిన విషయం తెలిసిందే.

Exit mobile version