Site icon TeluguMirchi.com

మోపిదేవికి బెయిల్ ఇవ్వొద్దు

జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ నాంపల్లిలోని సీబీఐ కోర్టును కోరింది. ఈ నెల24 నుంచి జనవరి 2 వరకు శబరిమల వెళ్లేందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మోపిదేవి కోర్టులో పిటీషన్ విషయం తెలిసిందే. అయితే మోపిదేవి మధ్యంతర బెయిల్ పిటీషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో మోపిదేవి బయటకు వస్తే సాక్షాలు తారుమారయ్యే అవకాశం ఉందని సీబీఐ ఆరోపించింది.

 

Exit mobile version