మరో 3 రోజుల్లో రుతుపవనాలు !

rutupavanaaluనైరుతి రుతుపవనాలు మరో 3, 4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 17న రుతుపవనాలు భారత ఉపఖండంలోనికి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రుతుపవనాలు బంగాళఖాతంలో మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో మరో 48 గంటల్లో అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులులకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే జూన్ 2 లేదా 3 తేదీల్లో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, నైరుతి రుతుపవనాల వల్ల ఈ యేడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.