Site icon TeluguMirchi.com

మిస్ ఇండియా స్ట్రీమింగ్ రైట్స్ ఎంతో తెలుసా..?

కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ మూతపడడంతో ఓటిటి సంస్థలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. సినీ ప్రేమికులంతా ఓటిటి పైనే ఎక్కువ మక్కువ చూపిస్తుండడం తో నిర్మాతలు సైతం తమ సినిమాలను ఓటిటి లలో రిలీజ్ చేస్తూ ఎంతో కొంత లాభం చవిచూస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు విడుదలై ఆకట్టుకోగా..తాజాగా కీర్తి సురేష్ తాజా చిత్రం మిస్ ఇండియా కు అదిరిపోయే స్ట్రీమింగ్ రైట్స్ వచ్చాయట .

ఈ చిత్ర నిర్మాత, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మ‌హేశ్ కోనేరుతో నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్ కుదుర్చుకుందని టాక్ వినిపిస్తోంది. రూ.10 కోట్టు వెచ్చించి Netflix మిస్ ఇండియా స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రం ద్వారా న‌రేంద్ర నాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏప్రిల్‌లోనే ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా..లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

Exit mobile version