కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ?

MIMకాంగ్రెస్ పార్టీకి ఇంతకాలం మద్దతునిస్తూ, అండదండగా నిలిచిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. భాగ్యలక్ష్మీ ఆలయం విషయంలో కిరణ్ సర్కార్ పై ఎంఐఎం గుర్రుగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన అత్యవసర భేటీలో కాంగ్రెస్కు మద్దతు ఉపసంహరించుకున్నట్లు ఎంఐఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా కొనసాగుతున్న మైనార్టీలపై నిర్బంధాలు, దాడుల గురించి ఇప్పటికే పలుమార్లు స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకొచ్చినా ఫలితం కనిపించడం లేదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.
అయితే తాజాగా ఈ రోజు(సోమవారం) ఉదయం ఎంఐఎం పోటిల్‌బ్యూరో సమావేశమైంది. భేటీ అనంతరం మద్దతు ఉపసంహరణపై కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 7గురుఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం కలిగి ఉన్న ఎంఐఎం రాష్ట్రంలో కిరణ్ సర్కార్‌కు, కేంద్రంలో యూపీఏకు మద్దతు నిస్తున్న విషయం తెలిసిందే.