Site icon TeluguMirchi.com

పెళ్లిలో రానా వైఫ్ వేసుకున్న డ్రెస్ ప్రత్యేకతలు చూసారా..?

రానా- మిహికా ల వివాహం రామానాయుడు స్టూడియో లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శనివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వివాహ బంధం తో ఒకటయ్యారు. కరోనా వైరస్ కారణంగా వివాహ వేడుకకు పెద్దగా ఎవర్ని ఆహ్వానించలేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత అదిరిపోయే వేడుక చేయాలని చూస్తున్నారు దగ్గుబాటి ఫ్యామిలీ.

ఈ వివాహ వేడుకకు చిత్ర సీమా నుండి కేవలం రామ్ చరణ్, శర్వానంద్ మాత్రమే హాజరయ్యారు. మిగతా వారంతా కూడా కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారు. అయితే వివాహంలో డిజైనర్ లెహంగాతో మిహీక మెరిసిపోయారు. కాగా వేల గంటల పాటు వెచ్చించి ఈ లెహంగాను తయారు చేశారట. ఈ విషయాన్ని డిజైనర్‌ అనామిక ఖన్నా వెల్లడించారు. క్రీమ్‌, గోల్డ్ కలర్‌లో ఉన్న ఈ లెహంగానూ పగడపు వీల్‌తో తాము తయారుచేసినట్లు ఆమె తెలిపారు. అంతేకాదు హ్యాండ్ ఎంబ్రాయిడీతోనే దీన్ని కుట్టినట్లు అనామిక వివరించారు. దీని ధర రూ.6లక్షలు ఉండొచ్చని సమాచారం.

Exit mobile version