Site icon TeluguMirchi.com

మెస్‌ ఛార్జీల పెంపు

hostesl-mess-charges-hickరాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలతో పాటు వికలాంగుల హాస్టళ్లల్లో చదివే విద్యార్థులకు కూడా తాజా పెంపు నిర్ణయం వర్తిస్తుందన్నారు. దీంతో పాటు హాస్టళ్లకు పంపిణీ చేసే బియ్యం ధరను కూడా కిలో ఒక్క రూపాయికి తగ్గిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రస్తుతం హాస్టళ్లకు కిలో బియ్యం నాలుగు రూపాయలకు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రస్తావిస్తూ… ‘పెద్దవాళ్లకు కిలో రూపాయికే ఇస్తున్నాం అలాంటిది పిల్లలకు నాలుగు రూపాయలకు ఇవ్వడం అన్యాయం’ అన్నారు. ఈనెల 9వ తేదీ నుండి పెంచిన మెస్ ఛార్జీలతో పాటు, బియ్యం ధర తగ్గింపు నిర్ణయం అమల్లోకి వస్తుందని సీఎం చెప్పారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. తాను ఇందిరమ్మ బాటలో భాగంగా హాస్టళ్లలో పడుకున్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానించా రని అన్నారు. విద్యార్థులకు ధైర్యం చెప్ప డం, ప్రభుత్వం వారితో ఉందన్న నమ్మకం కలిగించడంతో పాటు సమస్యలు తెలుసు కోవడానికే ఆ పని చేశానని ఆయన చెప్పారు. మెస్ఛార్జీల పెంపు వల్ల 8.81 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరు తుందని, రాష్ట్ర ఖజానాపై 271 కోట్ల రూ పాయల భారం పడుతుందని కిరణ్ తెలిపారు.

పెరిగిన డైట్ ఛార్జీలివే….(నెలకు)
తరగతి ప్రస్తుతం పెంపు తర్వాత
3నుండి 7 వరకు 475.00 750.00
8నుండి 10 వరకు 535.00 850.00
ఇంటర్మీడియట్ 535.00 1,050.00
డిగ్రీ 520.00 1,050.00
పీజి 682.00 1,050.00

Exit mobile version