రానా- మిహికా ల వివాహం రామానాయుడు స్టూడియో లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శనివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వివాహ బంధం తో ఒకటయ్యారు. కరోనా వైరస్ కారణంగా వివాహ వేడుకకు పెద్దగా ఎవర్ని ఆహ్వానించలేదు. పెళ్లి వేడుకలోని ముఖ్యమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రానాను భర్తగా పొంది వారం రోజులు గడిచిన తర్వాత సోషల్ మీడియాలో ఓ స్వీట్ మెసేజ్ పోస్ట్ చేసి అందరినీ ఆకర్షించింది మిహీకా. ”నా ప్రేమ, నా జీవితం, నా ఆత్మ, నా శరీరం అన్నీ నువ్వే. నా జీవితంలో పూర్తి భాగమై నా లైఫ్‌కు అర్థం చేకూర్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంతకన్నా మించి నేను ఏ కలలు కనలేదు. నా వ్యక్తిగత జీవితాన్ని కూడా సంపూర్ణంగా మార్చిన వ్యక్తివి నువ్వే.. ఐ లవ్ యూ” అంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో రానాపై ఉన్న ప్రేమను తెలిపేలా భావోద్వేగ పూరిత పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం మిహీకా పోస్ట్ పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది.