కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మాస్క్ , సామజిక దూరం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం , శానిటైజర్ల వాడకం చేయాలంటూ ప్రభుత్వాలు చెపుతున్నాయి. అయితే కొంతమంది మాస్క్ ద్వారా డ్రగ్స్ వ్యాపారం చేయడం హైదరాబాద్ లో వెలుగు చూసింది.
ఫేస్ మాస్కుల పేరుతో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా సభ్యులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 54 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.. బెంగళూరులోని నైజీరియన్ నుంచి 70 గ్రాముల కొకైన్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ చెందిన పరంజ్యోతి సింగ్, అమిత్ కుమార్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ పాసులు తీసుకుని డ్రగ్స్ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.