Site icon TeluguMirchi.com

మారుతి తెలివైన‌వాడే!

maruthiమారుతి త‌న బ్రాండ్‌నేమ్‌ని చాలా తెలివిగా వాడుకొంటున్నాడు. ఒక‌వైపు ద‌ర్శకుడిగా.. అవ‌కాశాలు అందిపుచ్చుకొంటూనే నిర్మాత‌గానూ లాభాలు ఆర్జించే ప్రయ‌త్నాలు చేస్తున్నాడు. డ‌బ్బింగ్ సినిమా మ‌హేష్‌కి మారుతి ఒకానొక భాగ‌స్వామి. ఈ సినిమాకి అతనేం పెట్టుబ‌డి పెట్టలేదు. జ‌స్ట్‌.. అత‌ని పేరు వాడుకొన్నందుకు వాటా ఇచ్చారంతే. రొమాన్స్ అనే మ‌రో చిన్న సినిమా కూడా ఇదే బాప‌తు వ్యవ‌హారం. మారుతి నిర్మాతా వ్యవ‌హ‌రించిన ప్రేమ క‌థా చిత్రమ్ కేవ‌లం 1.75 కోట్ల‌తో పూర్తి చేశారు. మారుతి పేరు మీద వ్యాపారం బాగా జ‌రిగింది. కోటి రూపాయ‌ల టేబుల్ ప్రాఫిట్‌తో ఈ సినిమా అమ్మేశాడు. ఇప్పుడు లాభాల్లో వాటా కూడా అందుకోబోతున్నాడు. ఈ సినిమాకి ద‌ర్శకుడు ప్రభాక‌ర్‌రెడ్డి. అయినా పేరు, లాభాలు మాత్రం మారుతికి షిఫ్ట అవుతున్నాయి. అవ‌న్నీ మారుతి తెలివితేట‌కు నిద‌ర్శనమే..!

Exit mobile version