లాక్ డౌన్ కారణంగా చిత్ర సీమా తీవ్రంగా నష్టపోయింది. దాదాపు రెండు నెలలకు పైగానే షూటింగ్లు , పోస్ట్ ప్రొడక్షన్ లు , థియేటర్స్ ఇలా అన్ని మూతపడడం తో నిర్మాతలకు కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టాలనుండి బయటపడాలంటే హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని అగ్ర దర్శకులు మణిరత్నం అన్నారు.
ఇటీవల ఓ వెబి నార్లో పాల్గొన్న మణిరత్నం ఈ విషయంపై స్పందించారు. థియేట్రికల్ బిజినెస్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ తిరిగి సరైన మార్గంలోకి వచ్చేంతవరకు హీరోలు, టెక్నిషియన్ లు తమ రెమ్యూనేషన్ ను తగ్గించుకుని ప్రొడ్యూసర్ లకు సహకరించాలన్నారు.