మ‌హేష్ టైటిల్ అదేనా??

maheshమ‌హేష్‌బాబు, సుకుమార్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా పేరేమిటి? మ‌హేష్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఇదే అంశం గురించి చ‌ర్చించుకొంటున్నారు. సినిమా మొద‌లై… ఇన్ని రోజులైనా ఆ టైటిల్‌పై ఇంకా స్పష్టత రాలేదు. ముందు ఆచార్య అనుకొన్నారు.. అది కాద‌ని తెలిసిపోయింది. సునామీ అనే ప్రచారం జ‌రిగింది. దానికీ మ‌హేష్‌బాబు ఓటేయ్యలేదు. ఈ లోగా మ‌రో కొత్త పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే… ‘వ‌న్‌’. ప్రతి విష‌యంలోనూ నెంబ‌ర్ వ‌న్ గా ఉండాలి.. అనుకొనే హీరో క‌థ అట‌. అందుకే వ‌న్ అనే పేరు పెట్టడానికి డిసైడ్ అయ్యార‌ట‌. ఇదైనా ఉంటుందో, లేదంటే మ‌రో కొత్త పేరు వెలుగులోకి వ‌స్తుందో?? ఈనెల 31న కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్బంగా టైటిల్ అధికారికంగా ప్రకటిస్తారు.