ఉత్కంఠతకు దాదాపు తెరపడింది. మహేష్‌బాబు సినిమా టైటిల్ అనధికారికంగా బయటకు వచ్చేసింది. మహేష్- సుకుమార్ కలయికలో వస్తున్న సినిమాకి ‘వన్’ అనే టైటిల్ దాదాపు ఖాయమైందని సమాచారమ్. ట్యాగ్ లైన్ ‘నేనొక్కడినే’ అని కూడా పెట్టారట. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఈ సినిమా టైటిల్ ని లాంఛనంగా ప్రకటిస్తారు. కొలంబస్ – వన్ – ది ప్రిన్స్ మధ్య గట్టి పోటీ వచ్చిందట. మహేష్ వన్ వైపే మొగ్గుచూపించాడట. టాలీవుడ్లో మహేష్ నెంబర్ వన్ అని మురిసిపోయే అభిమానులకు … ఈ టైటిల్ కచ్చితంగా నచ్చుతుందని చిత్రబృందం చెబుతోంది.